స్వేచ్ఛా విహంగం

Monday, May 28, 2007

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 85 వ జయంతి




స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 85 వ జయంతి
ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 85 వ జయంతి.

నటుడి గా ఆయన గొప్పతనం తెలియడానికి ఒక్క "దాన వీర శూర కర్ణ" సినిమా చాలు.

మనకు తెలిసిన, తెలియని ఎన్నో పౌరాణికాలను, చరిత్ర ను సినిమాల రూపం లో, CD DVD ల రూపంలో భావితరాలవారికి అన్న గారు అందించినట్టయ్యింది

ఇందిరాగాంధీ చనిపోయి దేశమంతా సానుభూతి పవనాలు వీస్తున్న సమయం లో రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ని మట్టి కరిపించడం ద్వారా దేశనాయకుల కన్నా మా నాయకుడి మీదే మాకు ప్రేమ ఎక్కువ అని తెలుగు వారు చెప్పటం NTR సమ్మోహన శక్తి కి నిదర్శనం.


"రాముడు" పేరు తో అన్నగారు నటించిన చిత్రాలు.

అగ్గి రాముడు (1954)
శభాష్ రాముడు (1951)
బండ రాముడు (1959)
టాక్సీ రాముడు (1961)
టైగర్ రాముడు (1962)
పిడుగు రాముడు (1966)
అడవి రాముడు (1977)
డ్రైవర్ రాముడు (1979)
శ్రుంగార రాముడు (1979)
ఛాలెంజ్ రాముడు (1980)
సర్కస్ రాముడు (1980)
సరదా రాముడు (1980)
కలియుగ రాముడు (1982)

అన్న గారి చిత్రాలలో మరికొన్ని "రాము"లు

రాముడు భీముడు (1964)
రాము (1968)
భక్త రామదాసు (1969)
రాముని మించిన రాముడు (1975)
శ్రీరామ పట్టాభిషేకం (1978)
రామ క్రుష్ణులు (1978)
రౌడీ రాముడు కొంటె క్రుష్ణుడు (1980)


Labels: ,

Friday, May 25, 2007

తెలుగు లో కామెంటరీ

విస్సా ఛానల్ వారు భారత్ బంగ్లా క్రికెట్ మ్యాచుల ప్రత్యక్ష ప్రసారానికి తెలుగు లో కామెంటరీ ఇస్తున్నారు.

ఈ ప్రయత్నం నిస్సందేహంగా అభినందించదగ్గదే.

Labels:

Tuesday, May 08, 2007

కొత్త తరానికి కొత్త రాజకీయం

కొత్త తరానికి కొత్త రాజకీయం, లోక్ సత్తా ఇది ప్రజల సత్తా అంటూ లోక్ సత్తా జాతీయ కన్వీనర్ జయ ప్రకాశ్ నారాయణ్ గత కొన్ని రోజులు గా క్రిష్ణా జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
విద్యావేత్తలు, యువతే లక్ష్యం గా ఈ పర్యటనలు సాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మీ పంచాయితీ ఆదాయం ఎంత అని ప్రశ్నించినపుడు ప్రజల నుండి సమాధానం రాలేదట కానీ ఇటీవలే బొంబాయి లో పెళ్లి చేసుకున్న సినీ జంట ఎవరని అడిగితే మాత్రం సమాధానం వెంటనే వచ్చిందట. అనవసర విషయాలు వదిలేసి అవసరమైన విషయాలలో చైతన్యం పెంచుకోవాలని, ప్రశ్నించే హక్కు తోనే రాజకీయ ప్రక్షాళన జరుగుతుందని ఆయన ప్రజలకు వివరిస్తున్నారు.

Labels:

Monday, May 07, 2007

NTR జాతీయ అవార్డు పునరుధ్ధరణ ???

NTR జయంతి లేదా వర్ధంతి దగ్గరకు రాగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఈ అవార్డే. మేమిస్తాం మేమిస్తాం అంటూ ఆవేశంగా ప్రకటించడం తప్ప జరిగింది శూన్యం.

గత 4 సంవత్సరాలు గా ఈ అవార్డు ను మూలన పడేసారు.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తో సరితూగే విధంగా నిర్వహించాల్సిన ఈ అవార్డుని ఇప్పటికే అభాసుపాల్చేశారు.

అవార్డు తరఫున ఇవ్వాల్సిన ఐదు లక్షలు ప్రభుత్వాల దగ్గర లేవట ?

ఈ సారి మహానాడు లో ఈ అవార్డు మేమే ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.

నా పాత పోస్టే మళ్లీ ఇక్కడ అతికిస్తున్నా.

========================
ఎన్టీఆర్ అవార్డు తో ఆటలు

గత మూడు సంవత్సరాల నుంచీ కూడా ఎన్టీఆర్ అవార్డు ప్రకటించటం లేదు.నిధుల లేమి అని పైకి చెప్తున్నాచిత్తశుద్ధి లోపం అని చెప్పవచ్చు.ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రకటించాల్సిన అవార్డు ని ప్రకటించడం లో జాప్యం తెలుగుదేశం ప్రభుత్వం తోనే మొదలైంది.ఈ జాప్యాన్ని కాంగ్రెస్ పై నెట్టి రాజకీయ లబ్ధి కొరకు తెలుగుదేశం ప్రయత్నిస్తున్నది.అవార్డు ప్రారంభించే సమయం లోనె నిధుల ఎర్పాటు గురించి అలోచించినట్లయితే నేడు ఈ పరిస్థితి వుండేది కాదు.ఎన్టీఆర్ వర్ధంతి లోగా ఈ అవార్డు ప్రకటిస్తే బాగుంటుంది.

(Posted on January 2006)

========================

Labels:

Friday, May 04, 2007

రోడ్డు ప్రమాదాలలో మనదే మొదటిస్థానం

మన రాతా? విధి వ్రాతా? చూసాక ఇది రాయాలని అనిపించింది.

మన వ్యవస్థ, మనం అందరం దీనికి కారకులమే.

హైదరాబాద్ లో వుండే ఎక్కువ మంది విద్యాధికులే.

వారిలో ఎంత మంది రోడ్డు నిబంధనలు పాటిస్తున్నారు. పాదచారులు మరీ దారుణం. సరిగ్గా వాహనాలకి గ్రీన్ సిగ్నల్ పడగానే వీరు రోడ్డు దాటటం మొదలు పెడతారు.

మొక్కై వంగనిది మానై వంగునా అని అన్ని నగరాలు, పట్టాణాలలో ఇదే పరిస్థితి.

కనీస మౌలిక వనరులైన రోడ్డ్లు, ప్రజా రవాణా వ్యవస్థ ఎవరికీ పట్టవు.

పంజాగుట్ట, బేగంపేట, అమీర్ పేట మొదలగు చోట్ల రోడ్డు దాటాలంటే మ్రుత్యువు తో కొంచం మాట్లాడినట్లే. జీబ్రా క్రాసింగ్ దగ్గర రోడ్డు దాట వచ్చు కదా అంటె దానిమీద వాహనాలు ఆగి వుంటాయి. కొంచం సర్కస్ చేసుకుంటూ రోడ్డు దాటక తప్పదు.

ఇక హైదరాబాద్ విజయవాడ జాతీయరహదారి NH9 మరీ ఘోరం.

సుమారు 7,8 సంవత్సరాల క్రితం హైదరాబాద్ విజయవాడ బస్సు ప్రయాణం 5 గంటలు పట్టేది. (250 కిమీ గంట కు 50 కిమీ వేగంతో).

కాలం మారిపోయింది. వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రయాణ సమయం 7 నుంచి 15 గంటలు.

రాత్రి 7 గంటలకు విజయవాడ లోనో, భద్రాచలం లోనో బయలు దేరిన ప్రయాణికులు మధ్యాహ్నం 12 గంటలకు KPHB చేరే సందర్భాలు అనేకం. (ఈ రోజు కుడా అదే జరిగింది)

పేరుకే జాతీయ రహదారి అయిన ఈ రోడ్డు లో ట్రాఫిక్ జాం, రోడ్డు ప్రమాదాలు నిత్యక్రుత్యాలు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట క్షేమంగా చేరామంటే సంబరపడాల్సిన విషయమే.

ఈ రోడ్డు ని నమ్ముకొని ఎందరో అంతర్జాతీయ విమానాలు మిస్ అయ్యారు.

పత్రికలలో రోజూ ఇటువంటి వార్తలు తప్ప ఇంకేదీ జరుగుతున్నది లేదు

జాతీయ రహదారిపై ఆదివారం ఇసుక లారీ, కారు ఢీకొని రహదారికి అడ్డంగా పడ్డాయి. వాహనాలు ఎక్కడిక్కడే పది కిలోమీటర్ల పొడవునా నిలిచిపోయాయి.


ఎప్పుడు జాతీయరహదారి నాలుగు లైన్లగా మార్పు చెందుతుందో తెలీదుగానీ..అప్పటివరకూ ఈ మృత్యుఘోష ఆగేలా కనిపించడం లేదు. ఎందరివో ప్రాణాలు హరీమంటూ గాలిలో కలిసిపోతున్నాయి. ఎక్కడో కొన్ని వేల మైళ్ల దూరం నుంచి వచ్చేవారు అంతవరకూ హాయిగానే వస్తున్నారు..సరిగ్గా నల్గొండ జిల్లా సరిహద్దుల్లోకి వచ్చేసరికి.. 4లైన్ల రహదారి లేకపోవడంతో మృత్యుముంగిట్లో వాలుతున్నారు. కొన్ని వేల ప్రాణాలు బలైపోతున్నా.. ఎవరికీ చీమకుట్టినట్లు కూడా ఉండకపోవడం.. ఇంత ప్రాధాన్యం ఉన్న రహదారి నిర్మాణానికి ఇంకా మీనమేషాలు లెక్కించడం విచారకరం.

Labels:

Tuesday, May 01, 2007

అడవిరాముడి కి 30 ఏళ్ళు

అడవిరాముడు చిత్రం విడుదల అయ్యి 30 సంవత్సరాలు నిండాయి.

ఇప్పటికీ 15 ప్రింట్ల తో రాష్ట్రం లో ఎక్కడో ఒక చోట ఈ చిత్రం ప్రదర్శింపబడుతూనే వుంది.

షోలే చిత్రం మహారాష్ట్ర లో 3 సెంటర్లలో 365 రోజులు ఆడగా, అడవిరాముడు మన రాష్ట్రం లో 4 సెంటర్లలో 365 రోజులు ఆడింది.

ఒక తెలుగు చిత్రం మొదటిసారిగా కోటి రూపాయల వసూళ్ళను దాటింది ఈ చిత్రం తోనే.

ఈ చిత్రం అప్పట్లోనే 4 కోట్ల కు పైగా వసూలు చేసింది. (అంటే ఇప్పుడు సుమారు 200 కోట్లు)

Labels: