స్వేచ్ఛా విహంగం

Wednesday, January 31, 2007

తెలుగు నామఫలకాలు (బోర్డులు)

అప్పుడెప్పుడో హైదరాబాదు కలెక్టర్ గారు నగరం లో వున్న అన్ని కార్యాలయాలు, వ్యాపార వాణిజ్య తదితర సంస్థల బోర్డులన్నీ తప్పనిసరిగా తెలుగు లో కూడా వుండాలని ఆదేశించినట్టు గుర్తు.

అదెంతవరకూ అమలయ్యిందో తెలియదు కానీ నగరం మధ్యలో వున్న Hyderabad Central వాడు తెలుగులో కూడా పెద్ద బోర్డు పెట్టాడు.

ఒక తెలుగు అభిమాని గా నాకు చాలా ఆనందం వేసింది.

Labels:

Friday, January 19, 2007

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 11 వ వర్ధంతి


స్వర్గీయ NTR నిష్క్రమించి ఇన్ని సంవత్సరాలు అయినా అనేక మంది తెలుగు ప్రజల మనసుల్లో ఆయన సజీవంగానే వున్నారు.

తెలుగు ప్రజలకు సినిమాలు జీవితం లో ఒక భాగం అయ్యాయంటే దానికి ఆద్యుడు NTR.

రాజకీయాల్లో ఆయన ప్రతి అడుగూ సంచలనమే.

నేను తెలుగు వాడిని నా పార్టి పేరు తెలుగుదేశం అప్పటికప్పుడు ప్రకటించినా, ఢిల్లీ ప్రదిక్షణాలు చేసే ముఖ్యమంత్రులు మనకు వద్దనీ కేంద్రం మిధ్య అనీ నినదించినా,

నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వ ఉద్యొగుల పదవీ విరమణ వయస్సు ను ఒక్క కలం పోటు తో 2 సంవత్సరాలు తగ్గించినా,

MLA లను రాష్ట్రపతి ముందు, జాతీయ మీడియా ముందు హాజరు వేయించినా,

బడ్జెట్ లీకు అయ్యిందని మొత్తం మంత్రివర్గాన్ని సస్పెండ్ చేసి, నెలకు పైగా ఒక్కడే రాష్ట్రాన్ని పరిపాలించినా,

తన మంత్రివర్గం లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి ఇంటి పై CBCID చే దాడులు చెయించినా,

రాజకీయ పునరావాస కేంద్రం గా మారిన శాసనమండలి ని రద్దు చెసినా,

తనపై ఆరోపణలతో నిరహారదీక్ష చేస్తున్న కాంగ్రెస్ శిబిరానికి ఎదురుగా తానే నిరహారదీక్ష కు కూర్చున్నా,

కనీ వినీ ఎరుగని జన రాజకీయాలకు నాంది పలకటం ఆయనకే చెల్లింది.

తెలుగు వాడి రాజకీయ చైతన్యానికి ఆయనే మూలం. అప్పటి వరకూ 40 శాతం వున్న ఓటింగ్ శాతం ఒక్కసారిగా 60 70 శాతాలను మించిందంటే ప్రజల రాజకీయ చైతన్యం ఎంత పెరిగిందో వూహించవచ్చు. మహిళలకు ఆస్థి హక్కు, బిసి లకు రిజర్వెషన్లు, ప్రజల వద్దకు పాలన ఆయన హయాం లో జరిగిన కొన్ని విధాన నిర్ణయాలు.

తెలుగు వాడు ప్రధాని అవుతున్నాడని నంద్యాల లో పి వి నరసింహారావు కు బహిరంగ మద్దతు పలికారు. తను ప్రారంభించిన సగానికి పైగా పధకాలకు తెలుగు పేరును చేర్చారు. (వీటిల్లో చాలావాటికి తర్వాతి ప్రభుత్వాలు తెలుగు తోకను కత్తిరించాయి, ఒక్క తెలుగు గంగ కు తప్ప).

భూమి పై తెలుగు వాడు వున్నంతవరకూ ఆయన సజీవం గానే వుంటారు.

Labels: ,

Monday, January 08, 2007

ప్రజా రవాణా వ్యవస్థ కు తూట్లు

అన్నీ అయి పొయ్యాయి. ఇక RTC మాత్రమే మిగిలింది.

దాన్ని కూడా అంచలంచలు గా మూసివేసే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి.

అన్ని రాష్ట్రాల RTC లలో APSRTC అగ్రగామి. మనకున్నన్ని మంచి బస్సులు, బస్సు డిపోలు, బస్టాండులు మరే రాష్ట్రానికీ లేవు.
నష్టాల సాకు తో RTC ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ తిరోగమనం మంచిది కాదు.

ఒకప్పుడు RTC బస్సు వచ్చే వూరిని అభివ్రుధ్ధి చెందిన వూరి గా పరిగణించేవారు. ఇప్పుడు ఆటోలదే రాజ్యం.

నలుగురు లేదా ఐదుగురు ఎక్కాల్సిన ఆటొల్లో 15, 20 మంది ని ఎక్కించుకుంటున్నా, అవి ప్రమాదాల బారిన పడుతున్నా నియంత్రించే వ్యవస్థే లెకుండా పొయింది.
బస్సుల్లేక పల్లెటూర్లు వెళ్లాలంటే తీరని అవస్థ.

పిల్లలు చదువులకోసం పక్కన వున్న పట్టణాలకు రావాలంటే ఇబ్బంది.

ప్రజాసంక్షేమం కోసం కష్టమైనా నష్టమైనా RTC ని నిర్వహించ వలసిన బాధ్యత ప్రభుత్వానికి వుంది.

APSRTC కి వున్న స్థలాల మీద వున్న శ్రధ్ధ ఆటోలు, ప్రైవేటు వాహనాలను నియంత్రించడానికి పెడితే లాభాలు వాటికవే వస్తాయి.

Labels: , ,