స్వేచ్ఛా విహంగం

Monday, January 08, 2007

ప్రజా రవాణా వ్యవస్థ కు తూట్లు

అన్నీ అయి పొయ్యాయి. ఇక RTC మాత్రమే మిగిలింది.

దాన్ని కూడా అంచలంచలు గా మూసివేసే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి.

అన్ని రాష్ట్రాల RTC లలో APSRTC అగ్రగామి. మనకున్నన్ని మంచి బస్సులు, బస్సు డిపోలు, బస్టాండులు మరే రాష్ట్రానికీ లేవు.
నష్టాల సాకు తో RTC ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ తిరోగమనం మంచిది కాదు.

ఒకప్పుడు RTC బస్సు వచ్చే వూరిని అభివ్రుధ్ధి చెందిన వూరి గా పరిగణించేవారు. ఇప్పుడు ఆటోలదే రాజ్యం.

నలుగురు లేదా ఐదుగురు ఎక్కాల్సిన ఆటొల్లో 15, 20 మంది ని ఎక్కించుకుంటున్నా, అవి ప్రమాదాల బారిన పడుతున్నా నియంత్రించే వ్యవస్థే లెకుండా పొయింది.
బస్సుల్లేక పల్లెటూర్లు వెళ్లాలంటే తీరని అవస్థ.

పిల్లలు చదువులకోసం పక్కన వున్న పట్టణాలకు రావాలంటే ఇబ్బంది.

ప్రజాసంక్షేమం కోసం కష్టమైనా నష్టమైనా RTC ని నిర్వహించ వలసిన బాధ్యత ప్రభుత్వానికి వుంది.

APSRTC కి వున్న స్థలాల మీద వున్న శ్రధ్ధ ఆటోలు, ప్రైవేటు వాహనాలను నియంత్రించడానికి పెడితే లాభాలు వాటికవే వస్తాయి.

Labels: , ,

1 Comments:

  • RTC అన్నిటికంటే సురక్షితమైన, సులభమైన రవాణా వ్యవస్థ. అయితే అధికారుల అలసత్వం, అవినీతి, ప్రయాణికుల పట్ల మర్యాద చూపకపోవడం లాంటి వటి వల్ల లాభాలు అక్కడక్కాడా రావట్లేదు.
    అయితే మీరన్నట్లు ప్రజలను ఆటోలకో, టాక్సీలకో వదిలేయకుండా ప్రజా సంక్షేమం దృష్ట్యా వీటిని కొనసాగించాలి.
    --ప్రసాద్
    http://blog.charasala.com

    అభిప్రాయము Blogger spandana వ్రాసినవారు 7:55 PM  

Post a Comment

<< Home