స్వేచ్ఛా విహంగం

Thursday, March 29, 2007

తెలుగు దేశానికి పాతికేళ్ళు

తెలుగు వాడి రాజకీయ చైతన్యానికి పునాది అయిన తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం జరిగి 25 సంవత్సరాలు అయ్యాయి.
ఈ 25 సంవత్సరాలలో 17 సంవత్సరాలు తెదేపా నే అధికారం లో వుంది.
తెదే పుట్టుక, తదనంతరం జరిగిన అనేక సంచలనాత్మక, ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి.
  • EMERGENCE OF TELUGU DESAM — And an Overview of Political Movements in Andhra: R.J. Rajendra Prasad; Master Minds, Academic Press (Pvt.) Ltd., Flat No. 105, Laxmi Plaza Apartments, Snehapuri Colony, Hyderabad-500035. Rs. 99
  • ఫ్లాష్ బాక్ (-ఐ వెంకట్రావు Senior journalist)
  • ఒకే ఒక్కడు (NTR biography) (-ఐ వెంకట్రావు Senior journalist)

Labels: ,

Friday, March 09, 2007

ఇదొకటి వుంది

అవును ఇదొకటి వుంది. కాకపొతే బూజు బాగా పట్టింది.

ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వారి వెబ్సైట్

Labels:

Thursday, March 08, 2007

తల్లి భాష కోసం ఉద్యమిస్తేనే తెలుగు జాతి ప్రగతి

తప్పకుండా చదవాల్సిన చక్కని వ్యాసం.

Labels: ,

Monday, March 05, 2007

తెలుగదేలయన్న...

(ఈనాడు విపుల ఫిబ్రవరి 2007 సంచిక నుంచి)

కాశీనాథుని నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి, తెలుగు భాషా చైతన్య సమితి

తెలుగు భాష ప్రాచీనత... అధికార భాషగా తెలుగు ... వ్యవహార శైలిలో తెలుగు భాష వాడకం... పరిరక్షణ... అంతెందుకు తెలుగు కవయిత్రి మొల్ల అన్నట్లు ''తేనె సోక నోరు తీయనగు రీతి...'' మన తెలుగు భాష ఔన్నత్యం గురించి ఉద్యమ స్ఫూర్తితో వ్యాస పరంపరను, అభిప్రాయమాలికలను సమీకరించి, చర్చించే తెలుగు భాషా వేదిక ఇది. కదలండి, కలం పట్టండి, అందరం చేతులు కలుపుదాం రండి!!

ఇవాళ తెలుగు రాష్ట్రంలో ఒక వింత పరిస్థితి అనుభవంలోకి వచ్చింది. ఈ రాష్ట్రం ఏర్పడి యాభై సంవత్సరాలైంది. పైగా దాని ఏర్పాటు భాషా ప్రాతిపదిక మూలంగా జరిగినటువంటిది. ఈ భాష మాతృభాషగా ఉన్న వాళ్లు ప్రపంచం మొత్తం మీద పదిహేను కోట్ల పైమాటే. సంఖ్యాపరంగా చూస్తే ప్రపం చ భాషల జాబితాలో ఈ భాషది ఆరోస్థానంగా చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ఒక భాషకి సంబంధించిన వ్యవహర్తల్లో ముప్పైశాతం ఆ భాషని చదవక పోయినట్త్లెతే ఆ భాష కనుమరుగవుతుంది. ప్రస్తుతం తెలుగులో ఆ శాతం ఇరవైకి దగ్గరవుతున్నట్లు సమాచారం. సంపూర్ణంగా ఎదిగి అద్భుత సాహిత్యం ఉన్న భాషలు సైతం కనుమరుగవటం చరిత్రలో ఉన్నదే. ప్రాకృతం, లాటిన్‌ వంటి వాటి సంగతి తెలిసిందే. సంస్కృతం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కనుమరుగైన హిబ్రూలాంటి భాషలు, 'వ్యవహర్తల' అంకితభావం వల్ల మరింత ఊపుతో ప్రాణం పోసుకుని కళకళలాడుతున్న వైనం ప్రత్యక్షమే. మళ్లీ తెలుగు విషయానికి వస్తే... తమిళానికి ప్రాచీన(శ్రేష్ఠ) భాష ప్రతిపత్తి కలిగించిన తర్వాత ఇక్కడి మన పెద్దలు తెలుగుకి కూడా ఆ హోదా కలిగించవలసిందేనని 'గోల' పెడుతున్నారు. తమిళం విషయం గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీల ఎన్నికల ప్రణాళికలోనే ఉన్నది. 'తెలుగు' ఈనాడు ఎవరికీ పట్టని వ్యవహారం. ఇప్పుడు కల్గిన ఈ వేడి కూడా ఆంధ్రులకు నిజంగా ఎంత ప్రతిష్ఠా హేతువో తెలియదు. తెలుగుకి విద్య, పాలన, వ్యవహార రంగాల్లో సముచిత స్థానం కలిగించాలంటూ మాతృభాషా సమితి పేరుతో వ్యవస్థీకృత ఉద్యమం మొదలై దశాబ్దం (1995) దాటింది. ఆ ఉద్యమకారులు, వనరులు పరిమితమైన సదస్సులు, సభలు పెట్టడం, వినతిపత్రాలు సమర్పించడం వంటివి ఎన్ని చేసినా పాలకవర్గ పక్షీయులలో ఏ విధమైన చలనం లేదు. పొరుగు రాష్ట్రం ఏదో బావుకుంటుందన్న దుగ్ధతో ప్రస్తుతం అన్ని పక్షాలవారూ గుండెలు బాదుకోవటం నిజంగా వింత పరిస్థితే. బహుశా ఇటువంటి గందరగోళం ఏ భాషా సమాజంలోనూ కనబడదు. 1952 ప్రాంతంలో ఆనాటి తూర్పు పాకిస్థాన్‌ ప్రజానీకం, పాకిస్థాన్‌ ప్రభుత్వం ఉర్దూ భాషను తమపైన రుద్దే ప్రయత్నాన్ని గర్హించి ఉద్యమించి తమ భాష బెంగాలీని కాపాడుకున్నారు. స్వభాషాభిమానం స్వాభిమాన సంకేతమని ఎలుగెత్తి చాటారు. కాలాంతరంలో ఇది బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి హేతువై- కొందరి బలిదానంతో- చరిత్రలో సువర్ణాక్షర లిఖితమై నిలిచింది. దీనికి నివాళిగా, ఐక్యరాజ్యసమితి ఇచ్చిన పిలుపు మేరకు తెలుగు భాషోద్యమకారులు ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవటం అందరికీ తెలిసిందే. దీనికి, ఈనాడు రాష్ట్రంలో మన భాష పట్ల భిన్న రాజకీయ పక్షాలు కనబరుస్తున్న ధోరణికి పోలికే లేదు. ఇది నిజంగా వింత పరిస్థితి కాక మరేమిటి?

మనలో చాలా మందికి తరచుగా ఎదురయ్యే ఒక అనుభవాన్ని ముచ్చటిస్తాను. బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో, రైలు, బస్సు టికెట్ల పదిలపాటు (రిజర్వేషన్‌) కేంద్రాల్లో, మన వంతు వచ్చేవరకు వేచి ఉంటామనుకోండి. మన దగ్గరికి ఎవరో వచ్చి 'ఈ పత్రాన్ని కాస్త నింపి ఇవ్వం'డని ప్రాధేయపడతారు. మనం 'మీకు తెలుగు వస్తే ఆ భాషలోనే రాయండి అంటూ తెలుగులోనే రాసిన మన పత్రాన్ని చూపిస్తాం. దాంతో సమస్య తీరుతుంది. ఏమిటీ దిక్కుమాలిన పరిస్థితి? అక్కడి దరఖాస్తు కాగితం అన్య భాషలైన హిందీ, ఇంగ్లిషుల్లో ఉండటం వల్ల తెలుగులో రాస్తే, అక్కడి మన తెలుగు అధికారే నిరాకరిస్తాడనో, నిరాదరిస్తాడనో భయం దీనిక్కా రణం! ఇది ప్రజల కొరకు, ప్రజలచేత నడుపుతున్న ప్రజాస్వామ్యమౌతుందా! ఇటువంటి వ్యవస్థ పట్ల ప్రజలకు మమైక్యం ఉంటుందా!
తెలుగు భాషోద్యమకారులు కాని, ఇతరులు కాని, భాషా సాహిత్య అంశాలకు సంబంధించిన సభలు పెట్టినప్పుడు తరచుగా వినబడే మాటలు కొన్ని ఉన్నాయి. 'దేశభాషలందు తెలుగు లెస్స', 'ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌'; తెలుగు 'సుందర తెలుంగు' అన్న తమిళ భారతి ప్రశంస, 'ఆంధ్రత్వమాంధ్ర భాషాచ నాల్పతపసః ఫలమ్‌' అని తమిళ వేదాంతి అప్పయ దీక్షితులవారు కొనియాడారని, తెలుగు భారతదేశపు అనుసంధాన భాష కాదగినదంటూ శాస్త్రజ్ఞుడు హోల్డేన్‌ ప్రశంసించారని... ఇలాంటి మాటలు కొందరు పదేపదే అప్పజెబుతూ ఉంటారు. మరికొందరు 'మన భాషకి యాభై ఆరు అక్షరాలున్నాయి. ప్రపంచంలోని అన్ని భాషల ధ్వనుల్ని మనం పలకడమే కాదు లిపిబద్ధం చేసుకోగలం' అంటూ మాట్లాడతారు. ఇటువంటి మాటలు వినీవినీ చెవులు చిల్లులు పడుతూ ఉంటాయి. ఎన్నిసార్లు చెబుతారు? ఇవి వినటానికా జనం వచ్చింది? ఏ భాష వారికి ఆ భాష గొప్పది. కాకిపిల్ల కాకికి ముద్దు!
ప్రపంచంలో తమ భాషవంటి అధ్వాన్నపు భాష మరొకటి ఈ భూమండలంలో లేదు అని ఏ కాలంలోనైనా ఎవరైనా అన్నట్లు విన్నామా?అటువంటప్పుడు భాష గురించి ఇంత అశాస్త్రీయమైన బడాయిలు ఎవరి కోసం? ప్రపంచంలో మాతృభాష అనేది ఆయా వ్యవహర్తలకు అమృతతుల్యం. భాషలో ఎన్ని ధ్వనులుండాలో ఆ అవసరం మేరకు అన్ని లిపి సంకేతాలు ఇంచుమించుగా ఉండనే ఉంటాయి. ఇందులో గొప్పా, తక్కువల ప్రమేయం ఏమీ లేదు. తెలుగులోనే మన వ్యవహారంలో ఉండే అన్ని ధ్వనులకూ తగినన్ని లిపి చిహ్నాలు ఉన్నట్లు చెప్పలేము. ఇవన్నీ ఆవేశపరుల మాటలు.

శాస్త్రీయతకు విరుద్ధమైన అంశాలు. భావోద్వేగం అవసరమే కాని, అది ఆలోచనని మింగేసేదిగా ఉండకూడదు. కంటికి కాటుక అందం కోసమే కాని, కన్ను పోగొట్టేదిగా ఉండకూడదు కదా! శాస్త్రీయమైన ఆలోచన ఏమిటంటే, మానవ నాగరకతలో భాష అద్భుతమైన పరిణామం. వ్యవహర్తల భావ ప్రకటనకి, బావోద్వేగ వినిమయానికి అత్యున్నత సాధనం మాతృభాష. ఉత్పత్తి సాధనాలలో భాషదే అగ్రస్థానం. సరియైున విద్య లేదా వ్యవహార జ్ఞానం మాతృభాష ద్వారానే సాధ్యం. ఇతర చదువులు ఎంతగా చదువుకున్నా, మాతృభాషలో తగినంత ప్రావీణ్యం లేకపోతే ఆ చదువు అసంపూర్ణం మాత్రమే కాదు అనర్థకారకం. ఒక సమాజంలో సభ్యుడుగా ఉంటూ, అది ఉత్పత్తి చేస్తున్న సర్వ సంపదల్ని, భోగాల్ని అనుభవిస్తూ, ఆ సమాజంతో 'మమేకం' కాకుండా, కనీసం కృతజ్ఞత కూడా చూపకుండా తాను దానికంటే భిన్నుడుగానో, అతీతుడుగానో, అధికుడుగానో వ్యవహరించటం సంస్కారం అనిపించుకుంటుందా! స్వస్థాన వేష భాషాభిమానం, సత్పురుష లక్షణం అని మన ఆదికవి సుభాషితం. తెలుగు భాషా పరిరక్షణ, అభివ్యాప్తి అనేది ఆవేశంతోనో, ఉద్వేగంతోనో చేసే పనులు కావు. కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ విచక్షణ లేని ఈ సమాజపు ఉమ్మడి ఆస్తి మన భాష. అవధికి మించిన అన్యభాషల సాంకర్యం వల్ల ఏర్పడే కాలుష్యాన్ని సాధ్యమైనంతగా నిరోధిస్తూ, కాపాడుకోవాల్సిన పవిత్ర సంపద. సమాజం పట్ల ప్రేమ, అభిమానం, అవగాహన, అంకిత భావాలు ఆవిష్కృతం కావలసి ఉన్న ఉత్కృష్ట కర్తవ్యం. దేశంలో డెబ్భై శాతం నిరక్షరాస్యులు. ఇంచుమించు అదే శాతం నిరుపేదలు. కాని వారి శ్రమఫలితం మీద సమాజం బతుకుతున్నది. వారి జీవన విధానం బాగుపడాలంటే వారికి తెలిసిన భాషలోనే వారికి కాస్త విద్యాగంధం అందించాలి.

మాతృభాషే శిశువు విద్యా ప్రస్థానానికి ప్రథమ సోపానం. అక్షర జ్ఞానం లేని జానపదుల పలుకుబళ్ళల్లో ఉన్న సృజనాత్మకత ప్రౌఢుల రచనల్లో కంటే విశిష్టమైనది. నూరుకోట్ల పైబడి ఉన్న దేశ జనాభాలో నోబెల్‌ గ్రహీతలు పట్టుమని పదిమంది లేకపోవటానికి కారణం, సృజనాత్మకతని హరింపజేసే అన్యభాషా మాధ్యమంలో జరిగే విద్యాబోధన అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ గ్రహింపు కోసం ఏ విశ్వవిద్యాలయాల పట్టాలు అవసరం లేదు. ప్రభుత్వాలు నియమించిన విద్యా కమిషన్లన్నీ ఈ అంశాన్నే బల్లగుద్ది చెబుతూనే ఉన్నాయి. తెలిసిన దాని ద్వారా తెలియనిదాన్ని తెలుసుకోవడం తెలివిగలవాళ్లందరూ చేస్తున్న పనే. కుహనా విద్యావంతులు, పండితమ్మన్యులు మాత్రం ఇంకోదారి తొక్కుతున్నారు. మాతృభాషా మాధ్యమం విధిగా, నిర్భంధంగా, కనీసం ప్రాథమిక స్థాయివరకైనా ఉండాలన్న ఉద్యమంలోని తర్కం ఇదే.

ఇక్కడో విషయం ప్రస్తావించక తప్పదు. స్వభాషా పదాలు, పదబంధాల స్థానంలో అన్యభాషా శబ్దాలు వాడితే వ్యవహార నష్టమేమి జరుగుతుందన్న అనుమానం రావచ్చు. నిజమే, సాధారణ వ్యవహారానికి భంగం కలగకపోవచ్చు. కాని భాషపై మనకున్న అవగాహనలో ఇక్కడ మరికొంత స్పష్టత అవసరం. భాష కేవలం భావ ప్రకటనా పరికరమే కాదు. ఒక జాతి అస్తిత్వానికి అది ఆయువుపట్టు. అది జాతి సాంస్కృతిక చరిత్రకు తిరుగులేని సాక్ష్యం. మన ఆశలు, ఆశయాలు, కష్టాలు, కన్నీళ్ళు; ఖేదాలు, మోదాలు; వీటిని ప్రత్యక్షంగా శాసిస్తుంది భాష. ఒక్కో పదం రాలిపోతే ఆ మేరకు మన కథకు గండి పడ్డట్టే.

సొంత భాషని విస్మరించడమంటే మన ల్ని మనమే పరాయీకరించుకోవడం.. ఇది చాలా భయంకరమైన పరిణామం. పరభాష ముఖ్యంగా, ప్రాథమిక స్థాయిలో మన అంతస్స్నాయువుల్ని నశింపజేస్తుంది. మాతృభాష మన జీవకణాల్లో, జీన్స్‌లో, నిక్షిప్తమై ఉంటుంది. పరభాష ఈ జీవాణువుల్ని పారతంత్య్రంలోకి నెట్టి వేస్తుంది. ఈ దేశ నాగరకత, సంస్కృతి, సంప్రదాయం గురించీ; తాడిత, పీడిత, బడుగు జనాల ఆక్రందనల గురించి రొమ్ము బాదుకునేవారు సైతం స్వభాషకీ, అది వ్యక్తం చేసే సమాజంలో పరస్పర సంబంధ బాంధవ్యాల స్వరూపం గురించీ దృష్టి పెట్టకపోవటం వారి సంకుచిత స్వార్థ దృష్టికి, అవకాశవాద రాజకీయ దివాళాతనానికి పరాకాష్ఠ అని చెప్పక తప్పదు.

స్వభాషా మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న వారి వాదన ఇంకోలా ఉంది. నిమ్నవర్గాల వారిని ఉన్నత విద్యకు దూరం చెయ్యడానికి అగ్రవర్ణాలు చేస్తున్న కుట్ర ఇది. ఇంతవరకూ తమకు దూరమైన ఇంగ్లిషు విద్య చదివితే, బడుగువారు, స్వేచ్ఛ, సమానత్వాలను అనుభవించగల్గుతారు. ఇది ఎంత అతార్కికమైన ఆలోచనో గుర్తించండి. భాష నేర్చుకోవటం వేరు, మాధ్యమం వేరు. తెలుగు భాషా చైతన్య సమితి ఇంగ్లిషుకి గాని ఇతర భాషలకు గాని వ్యతిరేకం కాదు. వారి ఉద్యమం మితిమీరిన అన్యభాషల కబళింపు నుంచి తెలుగుని కాపాడుకోవటం కోసమే.
తెలుగు భాషా వికాసమే తెలుగు జాతి ప్రకాశం అనేదే సమితి ఆదర్శం. ఈనాడు తెలుగువారిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించిన ఎందరెందరో ప్రముఖులు కనీసం ఉన్నత పాఠశాల స్థాయివరకు తెలుగు మాధ్యమంలో చదివినవారే. ఇటీవల అనేక పోటీ పరీక్షలోనూ, ఉద్యోగ నియామక పరీక్షల్లోనూ, ఉత్తమ స్థానాలను సంపాదించిన వారు తెలుగు మాధ్యమాల వారేనని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ప్రాథమిక విద్యా విధానంలో భిన్న మాధ్యమాల పద్ధతి, సర్వసామ్య ఆదర్శాన్ని అటకెక్కిస్తుంది. అగ్రవర్ణాల వారికి నిమ్నకులాల వారికి వేరు వేరు విద్యా విధానాలుండకూడదనే భాషోద్యమం లక్షిస్తున్నది. పైగా ఇంగ్లిషు మాధ్యమంవల్ల ఇంగ్లిషు భాష పట్టుబడుతుందన్న హామీ ఏమీ లేదు. స్వభాషేతర మాధ్యమంవల్ల చదువు, ముఖ్యంగా ప్రాథమిక విద్య, అసలు ఒంటబట్టదనేది విద్యావేత్తల నిశ్చితాభిప్రాయం. ప్రాథమిక స్థాయిలో 'మధ్యంతరం'గా ఆపివేసేవారు ఎక్కువగా ఇంగ్లిషులోనే తప్పిపోతున్నారు. నిజమైన చదువు, రవ్వంత అక్షర జ్ఞానం స్వభాష ద్వారానే సాధ్యమవుతుందన్న శాస్త్రీయమైన అవగాహన విద్యావంతుల్లో కూడా లేకపోవడం శోచనీయం. నిజానికి బడుగులు ఇంతవరకు సరియైున విద్యకు నోచుకోకపోవడానికి ప్రధానంగా ఏ ఒక్కరినో బాధ్యుల్ని చెయ్యడం న్యాయం కాదు. విద్య ప్రధాన సామాజిక అవసరంగా ప్రభుత్వం గుర్తించి ప్రాథమిక విద్యకు కేటాయింపుని పెంచాలి. ఇది ఉత్తమ సమాజ నిర్మాణానికి తగిన మదుపుగా, పెట్టుబడిగా ప్రభుత్వం గుర్తించాలి. సరియైున ఆరోగ్యం, ఉపాధి, సమానత్వం, స్వాభిమానం లక్ష్యాలుగా ముందుకు సాగే ప్రభుత్వాలు నాణ్యతలో లోపంలేని విద్యావకాశాల్ని బాగా పెంచాలి. ప్రస్తుతం ప్రభుత్వాలు ఈ లక్ష్యానికి తిలోదకాలు ఇచ్చాయి.

భాషా విషయికంగా ఆలోచిస్తున్నవారు భాషకి, సాహిత్యానికి ఉన్న సూక్ష్మ విభజన రేఖని గుర్తించడం అవసరం. సాహిత్యం కొందరిది. భాష అందరిదీని. రెండింటికీ ఆధారాధేయ సంబంధం కొంతవరకే. అస దృశ్య మానవతావాది, తొలి తెలుగు భాషా శాస్త్రజ్ఞుడు, గిడుగు రామమూర్తి ప్రధాన కార్యక్షేత్రం భాష. కేవలం సాహిత్యావసరాలకు పరిమితమైన గత కాలపు భాషని, ఆధునిక అవసరాలకు పరిణమింపజేయాలన్న తపనకు జీవితాన్ని అంకితం చేసిన త్యాగధనుడు. ఆ మహనీయుడి ఆలోచనల్ని ఆరాధిస్తూ ఆదర్శాలతో స్ఫూర్తి పొందుతూ ఆయన జయంతి- ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవంగా ప్రతి యేడూ ఘనంగా నిర్వహిస్తూ పదోతరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల్ని ఇతర ప్రోత్సాహకాలని ఇస్తూ, తెలుగు భాషా చైతన్య సమితి 'తెలుగు పండుగ' నిర్వహిస్తున్నది. ప్రభుత్వం, ఇతర స్వచ్ఛంద సంస్థలు, ఈ విధమైన తెలుగు ఉత్సవాల్ని మరింత జరుపుకోవాలి.

ఆర్థికంగా వెనుకబాటు కులాలవారే ఉత్పత్తికి మూలస్తంభాలు. భాషా నిర్మాణంలో కూడా వారిదే పెద్ద వాటా. విద్యావంతులు అనుకునేవాళ్లు, అరువు పదాల్ని సిద్ధాన్నంగా వాడుకునే సోమరులు. నిమ్న వర్గాలవారు సృజనశీలురు. స్వభాషలోని పదాల్ని వాడుకోవటం, వాటి ఆధారంగా కొత్త పదబంధాల్ని సృష్టించుకోవడం వారు చేసేపని. చదువుకున్నవారు 'థ్యాంక్స్‌' అనో, కృతజ్ఞతలు అనో వాడితే తెలు గు గ్రామీణులు 'మప్పిదాలు' చెబుతారు. అలాగే పైదారి (ప్త్లెఓవర్‌) సింగాడి చెంగు (ఇంద్రధనుస్సు) తవ్వోడ (డ్రెడ్జర్‌) రెక్కమాను (రైల్వేసిగ్నిల్‌) అని అంటారు. ఇలా ఎన్నో. ప్రభుత్వ సహకారంతో విశ్వవిద్యాలయాలు, అకాడెమీ వంటివి విస్తృతంగా నాణ్యమైన మాండలిక అధ్యయనం, బృహన్నిఘంటు నిర్మాణం చేపట్టాలి. వ్యావహారిక భాష సంపన్నం కావటంలోప్రసార మాధ్యమాల పాత్ర విశిష్టమైనది. ఆయా సందర్భాలలో ఆంగ్ల, ఉర్దూ పదాల్ని విశృంఖలంగా వాడకుండా, తెలుగు మాండలిక అధ్యయనంలో తేలిన పదజాలాన్ని, అవి దొరకని పక్షంలో సమీప సోదర ద్రావిడ పదాల్ని, పదబంధాల్ని వాడే దిశగా పత్రికలూ, ఇతర మాధ్యమాలు పరస్పరం సమన్వయంతో కృషి చెయ్యాలి.

లోపభూయిష్ట వాచక నిర్మాణం తెలుగు పట్ల విద్యార్థుల నైరాశ్యానికి కారణమన్న విమర్శలున్నాయి. 'సీఫెల్‌' నమూనాలో తెలుగు భాష, సమాజ అవసరాలకనుగుణంగా తెలుగుని అభివృద్ధిచేసే లక్ష్యంతో ఒక స్వతంత్ర సంస్థ ఏర్పాటు కావలసిన అవసరం ఎంతో ఉంది. తెలుగు మాధ్యమంలో చదివిన వారికి అన్నిచోట్ల రాయితీలు కల్పించాలి. ప్రమేయాత్మకత లేని సంస్కృతం, ఫ్రెంచి వగైరా భాషలకి ఉద్వాసన పలికి తెలుగు స్థాయిని రాశిలోనూ వాసిలోనూ పెంచాలి. అవసరమైతే సంస్కృతాన్ని ఇంకో తీరులో ప్రోత్సహించవచ్చు. తెలుగు వారిలో తెలుగు చైతన్యం పెంపొందించేవిధంగా అనేక చర్యలు చేపట్టాలి. తెలుగుకి ప్రత్యేక మంత్రి త్వ శాఖనేర్పాటు చెయ్యాలి. ఇది నేటి అవశ్య కర్తవ్యం.

తెలుగదేలయన్న దేశంబు తెలుగండ్రు
తెలుగు మనకు రక్షదీప్తి నొసగు
భాష పెంచు జనుల భావానురాగాలు
అక్షరాస్యతయును అతిశయించు.