స్వేచ్ఛా విహంగం

Tuesday, February 27, 2007

గరీబ్ రధ్

ఈ పేరే వినడానికి అదో రకం గా వుంది.

ఇంతకన్నా మంచి పేరు దొరకలేదేమో. AC ల్లో ప్రయాణించే పేదవాళ్ళు ఏవరో లాలూ కే తెలియాలి.

ఇక పోతే హైదరాబాద్ MMTS రెండో దశకు సుమారు 100 కోట్ల వరకూ కేంద్రం ఇవ్వల్సి ఉండగా కేటాయించింది 50 లక్షలు.

Sunday, February 25, 2007

నోకియా తెలుగు ఫోన్లు

మోడల్ (సుమారు ధర)

1110 (Rs. 1900)

2310 (Rs. 3000)
2610 (Rs. 3625)

6030 (Rs. 3675)

Labels:

Thursday, February 22, 2007

మాతృభాష నేర్చాకే మరేదైనా... (ఆంధ్రజ్యోతి నుంచి)


http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2007/feb/21edit4

మాతృభాష నేర్చాకే మరేదైనా...- కస్తూరి విశ్వనాథం

ఆంగ్ల భాషను మొదటి తరగతి నుంచే బోధించాలని సామాజిక, రాజకీయశ్రేణులు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. 'జాతీయ విజ్ఞాన సంఘం' ( నేషనల్‌ నాలెడ్జ్‌ కమిషన్‌) కూడా ఇటీవల ఇదే సూచన చేసింది! దీనికంతటికీ కారణం పాఠశాల స్థాయిలో ఆం గ్లంలో పట్టుసాధించిన పిల్లలు పై చదువుల్లో బాగా రాణిస్తారనే భావనే. 2007-08 విద్య సం వత్సరం నుంచే ప్రాథమిక విద్యలో ఆంగ్లాన్ని ఒకటవ తరగతిలోనే ప్రవేశ పెట్టాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా మాతృభాషలో విద్యాబోధనకి సమర్థనీయమైన శాస్త్రీయ దృ క్పథాన్ని వివరించటమెంతైనా అవసరం.

భాషా బోధన సిద్ధాంతాలపై మనం కొద్దిగా దృష్టి సారిస్తే భాషాభ్యాసనం భాషకు, భావా నికి సంబంధించిన నాడీ ధర్మశాస్త్ర ప్రాతిపదిక మీద ఆధారపడి ఉంటుందని, భాషా జ్ఞానార్జనం అభ్యాసకుడి సహజ సిద్ధ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని జ్ఞేయ మనోవైజ్ఞానికులు( కాగ్ని టివ్‌సైకాలజిస్ట్స్‌) అభిప్రాయపడినారు. ఒక భాషను నేర్చుకోవటం, ఆ భాష ద్వారా నేర్చుకో వటం, ఆ భాషను గురించి నేర్చుకోవటం భిన్న విషయాలు. మన పాఠశాలలో చాలమటుకు జరుగుతున్నది పై వాటిలో రెండవది, మూడవది మాత్రమే. పిల్లలు తెలుగు భాష ద్వారా గణి త విజ్ఞానశాస్త్రాలు నేర్చుకొంటారు. అలాగే తెలుగు కవులు, వారి కావ్యాల గూర్చి నేర్చుకొం టారు. వీటివల్ల నూతన శబ్దాలను, వాటి ప్రయోగ రీతులను తెలుసుకొంటారు. అయితే ఇవి మౌలికంగా భాషాభ్యసన పరిధిలోకి రావు. భాషాభ్యసనంలో శ్రవణం, భాషణం,పఠనం, లేఖ నంఅనే పరస్పర సంబంధం కలిగిన నాలుగు సమగ్ర కౌశలాలు ఉంటాయి. విని అర్థం చేసుకో లేనివారు మాట్లాడలేరుకూడా. అందువల్లనే పుట్టు చెవిటివాడు మూగవాడు కూడా అవుతాడు. శ్రవణం, భాషణం మౌఖిక మాధ్యమానికి చెందిన కౌశలాలు. పఠన లేఖనాలు లిఖిత మాధ్య మానికి చెందినవి. వీటిని నేర్చుకోవటానికి, ఆ భాష ఉచ్చరింపబడినట్లు లిఖించటాని కనువైన లిపి కావాలి. కనుక ఎవరైనా ఒక భాషలో ఈ నాలుగు కౌశలాలలలో తగినంత ప్రావీణ్యం సం పాదించినప్పుడే అతడాభాషను అభ్యసించాడనవచ్చు.

తెలుగు మాధ్యమంలో చదివే పిల్లలు తెలుగులోను, ఆంగ్ల మాధ్యమంలో చదివే పిల్లలు ఆం గ్లంలోను ఎక్కువ మార్కులు పొందడం కద్దు. దీనికి ఆయా మాధ్యమాల ద్వారా చదివే గణిత విజ్ఞాన శాస్త్రాది విషయాలనుంచి పొందే శబ్ద జాలం, తరగతి గదిలో ఉపాధ్యాయుల ఉపన్యా సాల ద్వారా ఆ భాషను వినటం కొంత దోహదం చేస్తాయి. కౌశలాల దృష్టికోణం నుంచి చూస్తే సమగ్ర సాధనం (ఓవరాల్‌ ఎఛీవ్‌మెంట్‌)లో తెలుగు మాతృభాషగా గల విద్యార్థులు తెలుగు మాధ్యమంద్వారా సాధించిననంత అభివృద్ధి, అదే తెలుగు మాతృభాషగా గల విద్యార్థులు ఆం గ్ల మాధ్యమం ద్వారా సాధించలేరు. అంతేకాక, మన పరీక్షా విధానం చాలా మటుకు లిఖిత రూపంలో ఉంటుంది. ఒకవేళ కౌశలాల పరంగా పరీక్షలు నిర్వహింపబడితే ఈ వ్యత్యాసమింకా అధికమౌతుంది. దీనికి ముఖ్యకారణం, తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్థులకున్న సౌకర్యం ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థులకు లేకపోవటమే. తెలుగు మాతృభాషగా కలిగి తెలుగు మాధ్యమంలో చదివే పిల్లలకు పాఠశాల ప్రవేశ సమయానికే మొదటి రెండు భాషా కౌశలాల యిన శ్రవణ భాషణాలు వచ్చి ఉంటాయి. అంటే విని తెలుగును అర్థం చేసుకోవటం, మాట్లాడ టం వచ్చి ఉంటుంది. దీనివల్ల తరగతిలో ఉపాధ్యాయులు తెలుగులో బోధించే పాఠాలు విని సులభంగా ఆకళింపు చేసుకోవటమే కాక, ఉత్సాహంతో ప్రశ్నలడిగి తెలియని విషయాలు తెలు సుకొంటారు. ఆంగ్ల మాధ్యమంలో చదివే పిల్లలకీ సౌకర్యముండదు. తరగతి గదిలో ఉపాధ్యా యులు బోధించేవి, గృహ భాష పరిసర భాషకాని ఆ కొత్త భాషలో విని అర్థం చేసుకోవటం, మాట్లాడటం సాధ్యంకాదు. కనుక ఉపాధ్యాయులు బోధించే విషయాలను సరిగా ఆకళింపు చేసుకోలేరు. అర్థం కానివి అడిగి తెలుసుకోవటానికి తగినంత భాషా పరిజ్ఞానముండదు. మన సులో ప్రశ్నలు మొదిలినా కొన్ని పదాలు తెలిసినా ఆ ప్రాథమిక స్థాయిలో, తెలుగు వ్యాకరణా నికి భిన్నమైన ఆంగ్ల భాషా వ్యాకరణంలో వాక్య నిర్మాణం, ప్రశ్నలు కూర్చటం చేతకాక మాట్లా డలేకపోవచ్చు. కాబట్టి సందేహ నివృత్తికోసం ప్రశ్నలడగలేకపోవచ్చు. దానికితోడు వచ్చిరాని భాషలో అడగడానికి ఇతరుల ముందు సిగ్గుపడే పిల్లలుకూడ ఉంటారు. వీటన్నిటిని పరిగణ నలోకి తీసుకొంటే సంవత్సరాంత పరీక్షలలో తెలుగు మాతృభాషగా కలిగిన ఆంగ్ల మాధ్యమ విద్యార్థి సాధించేజ్ఞానం, అదే తెలుగు మాతృభాషగా కలిగిన తెలుగు మాధ్యమ విద్యార్థి సాధిం చిన దానికంటే ఎంతో తక్కువగా ఉంటుంది. కనుకనే, ప్రాథమిక విద్య మాతృ భాషలోనే ఉం డాలని , దానివల్ల పిల్లలు సులభంగా నేర్చుకోగలుగుతారని, అది ఆ చిన్న వయస్సులో పిల్లల మనోభావాల పైన అమోఘంగా పనిచేస్తుందని, పిల్లల మానసిక వికాసానికి పురోభివృద్ధికి అది యెంతగానో తోడ్పడుతుందని తల్లిదండ్రులు తెలుసుకోవాలి.

త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తున్న మన రాష్ట్రంలో తెలుగు (మాతృభాష), ఆంగ్లం, హిం ది పాఠశాలస్థాయిలో బోధింపబడుతున్నాయి. మాతృభాషతోపాటు పరభాషను కూడా ఒకట వ తరగతినుంచి ప్రవేశపెట్టడం పిల్లలను మానసికంగా కృంగ దీస్తుందనే వాస్తవాన్ని గుర్తించా లి. తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది కాగా ఆంగ్లం ఇండో-యూరోపియన్‌ భాషా కుటుంబానికి చెందినది. తెలుగుతో పోల్చిచూస్తే ఉచ్ఛారణకు భిన్నంగా లిఖించడం, తెలుగు లోని ధ్వనులు కొన్నిటిని కలిగివుండటం, ఒక లిపి సంకేతానికి రెండు మూడు ఉచ్ఛారణలు కలి గివుండటం ఆంగ్లభాషా ప్రత్యేకతలు. వాక్య నిర్మాణం కూడా తెలుగుకు పూర్తిగా భిన్నమైనదే. ఆంగ్లం వలెనే హిందీ కూడా ఇండో-యూరోపియన్‌ భాషా కుటుంబానికి చెందినది. ఆంగ్లంలో ఉన్న సమస్యలతో పాటు ఈ భాషలో లింగ సమస్య కూడా ఉంది. ఏ పదాలు ఏ లింగానికి చెం దినవో తెలుసుకొనే పద్ధతిలేదు. వీటన్నిటికి తోడు ఈ భాషల లిపులుకూడా సమస్యగా తయా రవుతాయి. తెలుగు లిపి అక్షర లిపి. తెలుగు అక్షరాలు (ఐదు మినహా) అప్రదక్షిణ క్రమంలో రాయబడి ఒకరేఖ మీద నిలబడినట్లుంటాయి. సంయుక్తాక్షరాలలో మొదటి అక్షరం పూర్తిగాను, రెండవది సగం రాయబడుతుంది. హిందీకి ఉపయోగించే దేవ నాగరిలో కొన్ని తెలుగులో లాగాను, కొన్ని సప్రదక్షిణ క్రమంలోను, మరికొన్ని పైనుంచి కిందకు రాయబడుతాయి. ఇక ఆంగ్ల లిపి ఆల్ఫాబిటిక్‌ లిపి. తెలుగులో ఒక అక్షరానికి ఇక ్కడ రెండక్షరాలు ఉంటాయి.

పాఠశాలస్థాయిలో బోధింపబడే ఈ మూడు భాషలను పోల్చిచూస్తే ఇటువంటి వైరుధ్యాలు మరెన్నో కనిపిస్తాయి. మరి ఇన్ని తారతమ్యాలున్న మూడు భాషలను 10, 11 సంవత్సరాల వయస్సులోనే నేర్పబూనటంవల్ల కలిగే పరిణామాలనుకూడ ఆలోచించాలి. భాషలను పిల్లలు త్వరగా నేర్చుకోగలరు అనేదానిలో కొంత నిజమున్నా ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని భాషల ను, అదికూడ ఇతర విషయాలతోపాటు నేర్చుకోవటం అంత సులభం కాదు. అంతేకాక పిల్లలం దరు ఒకే పద్ధతిలో ఒకే సమయ పరిమితిలో నేర్చుకోలేరు. ఇలా ఒకేసారి తెలుగు ఇంగ్లీషు వం టి భాషలను ప్రవేశపెట్టడం పసిహృదయాలకు తికమక కలిగించి వారిని మానసిక ఒత్తిడులకు గురిచేసే అవకాశమెంతైనాఉంది. దీనివలన వారిలో చదువు పట్ల వ్యతిరేక భావనను కలిగించి నిరుత్సాహపరచే ప్రమాదముంది. కనుక ప్రాథమిక విద్యలో ఒక భాషను ప్రవేశపెట్టిన తరువా త దానిలో కొద్దిగా నిలదొక్కుకొన్నతర్వాత మరొక భాషను ప్రవేశపెట్టడం ఉత్తమం. ఒక భాష కు మరోభాషకు మధ్య కనీసం రెండుమూడు సంవత్సరాల వ్యవధి ఉండటం ఎంతైనా అభిల షణీయమే కాక శ్రేయస్కరం కూడా. ఒకటవ తరగతిలో తెలుగు బోధన ప్రారంభమైతే ఆంగ్ల భాషను మూడు లేక 4వ తరగతి నుంచి ప్రారంభిస్తేనే మంచిది.

వ్యాసకర్త మైసూరులోని 'సదరన్‌ రీజినల్‌ లాంగ్వెజ్‌ సెంటర్‌'లో ప్రిన్సిపల్‌గానూ, 'సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వెజెస్‌' డిప్యూటి డైరక్టర్‌గానూ, ద్రవిడ విశ్వవిద్యాలయంలో లాంగ్వెజ్‌ టీచింగ్‌ టెక్నాలజీ విభాగాధిపతిగానూ పనిచేశారు.

Labels:

Wednesday, February 21, 2007

తెలుగు కు ప్రాచీన భాష హోదా ఏమైంది ?

అప్పుడెప్పుడొ M S సత్యన్నారాయణ (మాజీ క్రీడలు, సాంస్క్రుతిక శాఖా మంత్రి) గారి ఆధ్వర్యం లో ఒక కమిటి ఏర్పడి ఢిల్లీ వెళ్లి సాక్ష్యాలు ఇచ్చి వచ్చారు కదా.
మరి సౌండ్ లేదేంటి ?.

నెలకు పది సార్లు ఢిల్లీ వెళ్లే నాయకులు కొంచం దీని గురించి ఆలోచిస్తే బాగుంటుంది.

Labels:

Tuesday, February 20, 2007

అంతర్జాతీయ మాత్రుభాషా దినోత్సవం


అంతర్జాతీయ మాత్రుభాషా దినోత్సవం సందర్భం గా ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం వారి కార్యక్రమాలు.


Labels: ,