స్వేచ్ఛా విహంగం

Friday, January 19, 2007

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 11 వ వర్ధంతి


స్వర్గీయ NTR నిష్క్రమించి ఇన్ని సంవత్సరాలు అయినా అనేక మంది తెలుగు ప్రజల మనసుల్లో ఆయన సజీవంగానే వున్నారు.

తెలుగు ప్రజలకు సినిమాలు జీవితం లో ఒక భాగం అయ్యాయంటే దానికి ఆద్యుడు NTR.

రాజకీయాల్లో ఆయన ప్రతి అడుగూ సంచలనమే.

నేను తెలుగు వాడిని నా పార్టి పేరు తెలుగుదేశం అప్పటికప్పుడు ప్రకటించినా, ఢిల్లీ ప్రదిక్షణాలు చేసే ముఖ్యమంత్రులు మనకు వద్దనీ కేంద్రం మిధ్య అనీ నినదించినా,

నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వ ఉద్యొగుల పదవీ విరమణ వయస్సు ను ఒక్క కలం పోటు తో 2 సంవత్సరాలు తగ్గించినా,

MLA లను రాష్ట్రపతి ముందు, జాతీయ మీడియా ముందు హాజరు వేయించినా,

బడ్జెట్ లీకు అయ్యిందని మొత్తం మంత్రివర్గాన్ని సస్పెండ్ చేసి, నెలకు పైగా ఒక్కడే రాష్ట్రాన్ని పరిపాలించినా,

తన మంత్రివర్గం లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మంత్రి ఇంటి పై CBCID చే దాడులు చెయించినా,

రాజకీయ పునరావాస కేంద్రం గా మారిన శాసనమండలి ని రద్దు చెసినా,

తనపై ఆరోపణలతో నిరహారదీక్ష చేస్తున్న కాంగ్రెస్ శిబిరానికి ఎదురుగా తానే నిరహారదీక్ష కు కూర్చున్నా,

కనీ వినీ ఎరుగని జన రాజకీయాలకు నాంది పలకటం ఆయనకే చెల్లింది.

తెలుగు వాడి రాజకీయ చైతన్యానికి ఆయనే మూలం. అప్పటి వరకూ 40 శాతం వున్న ఓటింగ్ శాతం ఒక్కసారిగా 60 70 శాతాలను మించిందంటే ప్రజల రాజకీయ చైతన్యం ఎంత పెరిగిందో వూహించవచ్చు. మహిళలకు ఆస్థి హక్కు, బిసి లకు రిజర్వెషన్లు, ప్రజల వద్దకు పాలన ఆయన హయాం లో జరిగిన కొన్ని విధాన నిర్ణయాలు.

తెలుగు వాడు ప్రధాని అవుతున్నాడని నంద్యాల లో పి వి నరసింహారావు కు బహిరంగ మద్దతు పలికారు. తను ప్రారంభించిన సగానికి పైగా పధకాలకు తెలుగు పేరును చేర్చారు. (వీటిల్లో చాలావాటికి తర్వాతి ప్రభుత్వాలు తెలుగు తోకను కత్తిరించాయి, ఒక్క తెలుగు గంగ కు తప్ప).

భూమి పై తెలుగు వాడు వున్నంతవరకూ ఆయన సజీవం గానే వుంటారు.

Labels: ,

3 Comments:

  • Good and keep posting

    అభిప్రాయము Anonymous Anonymous వ్రాసినవారు 5:02 PM  

  • మరొక్క సారి అన్న గారిని గుర్తు చేసినందుకు. ధన్య వాదాలు.

    విహారి.
    http://vihaari.blogspot.com

    అభిప్రాయము Anonymous Anonymous వ్రాసినవారు 11:19 PM  

  • అవును. ఆయన చిరస్థాయిగా మనకు అన్నగా నిలిచిపోతారు.
    ఆయనొచ్చేవరకు జన సామాన్యానికి ఇందిరమ్మ తెలుసే గానీ ముఖ్యమంత్రికి పూచికపాటి విలువిచ్చేవారు కాదు. మన ముఖ్యమంత్రి ఎవరంటే చెప్పగలిగేవారూ కాదు.
    మహిళలకు, వెనుకబడిన తరగతులకు వెన్నుదన్నుగా రాజకీయాల్లో ఓనమాల్లో ఓనమాలు దిద్దించిన వాడు. తెలుగు కీర్తిని నలుదిసెలా చాటిన వాడు.
    --ప్రసాద్
    http://blog.charasala.com

    అభిప్రాయము Blogger spandana వ్రాసినవారు 1:31 AM  

Post a Comment

<< Home