రోడ్డు ప్రమాదాలలో మనదే మొదటిస్థానం
మన వ్యవస్థ, మనం అందరం దీనికి కారకులమే.
హైదరాబాద్ లో వుండే ఎక్కువ మంది విద్యాధికులే.
వారిలో ఎంత మంది రోడ్డు నిబంధనలు పాటిస్తున్నారు. పాదచారులు మరీ దారుణం. సరిగ్గా వాహనాలకి గ్రీన్ సిగ్నల్ పడగానే వీరు రోడ్డు దాటటం మొదలు పెడతారు.
మొక్కై వంగనిది మానై వంగునా అని అన్ని నగరాలు, పట్టాణాలలో ఇదే పరిస్థితి.
కనీస మౌలిక వనరులైన రోడ్డ్లు, ప్రజా రవాణా వ్యవస్థ ఎవరికీ పట్టవు.
పంజాగుట్ట, బేగంపేట, అమీర్ పేట మొదలగు చోట్ల రోడ్డు దాటాలంటే మ్రుత్యువు తో కొంచం మాట్లాడినట్లే. జీబ్రా క్రాసింగ్ దగ్గర రోడ్డు దాట వచ్చు కదా అంటె దానిమీద వాహనాలు ఆగి వుంటాయి. కొంచం సర్కస్ చేసుకుంటూ రోడ్డు దాటక తప్పదు.
ఇక హైదరాబాద్ విజయవాడ జాతీయరహదారి NH9 మరీ ఘోరం.
సుమారు 7,8 సంవత్సరాల క్రితం హైదరాబాద్ విజయవాడ బస్సు ప్రయాణం 5 గంటలు పట్టేది. (250 కిమీ గంట కు 50 కిమీ వేగంతో).
కాలం మారిపోయింది. వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రయాణ సమయం 7 నుంచి 15 గంటలు.
రాత్రి 7 గంటలకు విజయవాడ లోనో, భద్రాచలం లోనో బయలు దేరిన ప్రయాణికులు మధ్యాహ్నం 12 గంటలకు KPHB చేరే సందర్భాలు అనేకం. (ఈ రోజు కుడా అదే జరిగింది)
పేరుకే జాతీయ రహదారి అయిన ఈ రోడ్డు లో ట్రాఫిక్ జాం, రోడ్డు ప్రమాదాలు నిత్యక్రుత్యాలు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట క్షేమంగా చేరామంటే సంబరపడాల్సిన విషయమే.
ఈ రోడ్డు ని నమ్ముకొని ఎందరో అంతర్జాతీయ విమానాలు మిస్ అయ్యారు.
పత్రికలలో రోజూ ఇటువంటి వార్తలు తప్ప ఇంకేదీ జరుగుతున్నది లేదు
జాతీయ రహదారిపై ఆదివారం ఇసుక లారీ, కారు ఢీకొని రహదారికి అడ్డంగా పడ్డాయి. వాహనాలు ఎక్కడిక్కడే పది కిలోమీటర్ల పొడవునా నిలిచిపోయాయి.
ఎప్పుడు జాతీయరహదారి నాలుగు లైన్లగా మార్పు చెందుతుందో తెలీదుగానీ..అప్పటివరకూ ఈ మృత్యుఘోష ఆగేలా కనిపించడం లేదు. ఎందరివో ప్రాణాలు హరీమంటూ గాలిలో కలిసిపోతున్నాయి. ఎక్కడో కొన్ని వేల మైళ్ల దూరం నుంచి వచ్చేవారు అంతవరకూ హాయిగానే వస్తున్నారు..సరిగ్గా నల్గొండ జిల్లా సరిహద్దుల్లోకి వచ్చేసరికి.. 4లైన్ల రహదారి లేకపోవడంతో మృత్యుముంగిట్లో వాలుతున్నారు. కొన్ని వేల ప్రాణాలు బలైపోతున్నా.. ఎవరికీ చీమకుట్టినట్లు కూడా ఉండకపోవడం.. ఇంత ప్రాధాన్యం ఉన్న రహదారి నిర్మాణానికి ఇంకా మీనమేషాలు లెక్కించడం విచారకరం.
Labels: హైదరాబాద్ విజయవాడ జాతీయరహదారి
1 Comments:
రోడ్లు వెడల్పవడం ఒక్కటే సరిపోదనుకుంట.
డ్రైవింగ్ పట్ల జనాల అభిప్రాయం కూడా మారాలి.
వ్యవస్థని గౌరవించని సమాజంలో రోడ్డు వ్యవస్థ వంటివి వికశించడం ఒ కల.
అభిప్రాయము
rākeśvara వ్రాసినవారు 2:26 PM
Post a Comment
<< Home