స్వేచ్ఛా విహంగం

Thursday, March 16, 2006

ఆంధ్రుడా!

ఆంధ్రుడా!


ఏభాషరా నీది యేమి వేషమురా?ఈ భాష ఈ వేష మెవరి కోసమురా?ఆంగ్లమందున మాటలాడ గలుగగనేఇంతగా గుల్కెదవు ఎందుకోసమురా?సూటు బూటు హ్యాటు షోకుగా దొడుగఘనతేమి వచ్చెరా గర్వమేటికిరా? ఏ భాషరా
ఉర్దు మాటలాడి యుబ్బుబ్బి పడుటకుకారణంబేమిటో కాస్త చెప్పుమురా?లాగు షేర్వాణీలు బాగుండుననుచుమురిసిపోయెదవంత మురిపమేమిటిరా? ఏ భాషరా
నీ వేషభాషలిల నిగ్గుదేలినవన్నవిషయంబు నీవేల విశ్వసింపవురా?నీ భాష దీనతకు నీ వేష దుస్థితికికారకుడవీవయని కాంచవెందుకురా? ఏ భాషరా
నీ వేషభాషలను నిర్లక్ష్యముగ జూచుభావదాస్యం బెపుడు బాసిపోవునురా?నీ భాషయందును నీ వేషమందునుస్వాభిమానముడిగిన చవటనీవేరా? ఏ భాషరా
తెలుగు బిడ్డడవయ్యు తెల్గు రాదంచునుసిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా?దేశ భాషలందు తెలుగు లెస్స యటంచుతెలుగు బిడ్డా! యెపుడు తెలుసుకొందువురా?తెలుగుబిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకుసంకోచపడియెదవు సంగతేమిటిరా?అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచుసకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా? ఏ భాషరా

( మే 2004 - “నడుస్తున్న చరిత్ర ” పత్రిక నుండి తీసుకోబడినది. Exact source: http://www.oremuna.com/blog/ )

0 Comments:

Post a Comment

<< Home