స్వేచ్ఛా విహంగం

Thursday, December 28, 2006

నోకియా ఫోన్ కొంటున్నారా ?? అయితే నోకియా తెలుగు ఫోన్ కొనండి

మన దేశం లో మొబైల్ వాడకం గణనీయంగా పెరిగినా వాటిని ప్రాంతీయ భాష ల్లో అందుబాటు లొకి తేవటం లో అన్ని కంపనీలు విఫలమయ్యాయి.

ఈ దిశ గా నోకియా కొన్ని మోడెల్స్ ప్రవేశ పెట్టింది.

ఈ ఫోన్ల పెట్టె మీద "నమస్కారం" అని తెలుగు లో వ్రాసి వుంటుంది. వీటిల్లొ మెను, కీపాడ్ లు తెలుగు లో చూడవచ్చు. ఆంగ్లం ఎలాగూ వుంటుంది

కాకపొతే ఇవి రెండు, మూడు ప్రారంభ మోడల్స్ లొనే లభ్యమవుతున్నాయి (Nokia 6030, 2610 మొదలైనవి).

మంచి ప్రచారంతో గ్రామీణ మార్కెట్ లో అత్యధిక వాటా సంపాదించే అవకాశం వుంది.

వీటికి లభించే స్పందన ను బట్టి మరిన్ని మొడెల్స్ లో తెలుగు అందుబాటు లోకి రావచ్చు.

మీరు కొనదలుచుకున్న మోడెల్ లో తెలుగు వుంటే తెలుగు ఫొనే కొనండి.

Labels: ,

Wednesday, December 27, 2006

"హరిత" విప్లవం

ఖమ్మం జిల్లా పాల్వంచ లో సుమారు 10 సంవత్సరాల క్రితం మొదలైన హరిత విప్లవం.

http://www.jeef.or.jp/EAST_ASIA/india/hal.html

Tuesday, December 19, 2006

మెదక్ జిల్లా లో IIT

మెదక్ జిల్లా లో IIT ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి శాసనసభ లో ప్రకటించారు.

చుక్కా రామయ్య వారి వంటి ఎందరో ప్రముఖ విద్యావేత్తలు కలలు కన్నIIT ఎట్టకేలకు రావటం తెలుగు వారికి గర్వకారణం. దేశంలో ఉన్న అన్ని IIT లలో చదివిన, చదువుతున్న తెలుగు విద్యార్థుల సంఖ్య ద్రుష్ట్యా మనం IIT కి పక్కాగా అర్హులం (We deseve it).

కాకపోతే ఎప్పటినుంచో అనుకుంటున్న బాసర లో ఏర్పాటు చెస్తే ఇంకా బాగుండేది.
ఇటువంటి ప్రతిష్టాత్మక సంస్థలన్నీ పట్టణాలకు పరిమితమా !

Tuesday, December 05, 2006

తెలుగు తల్లి కి మరింత గౌరవం


ఈనాడు హైదరాబాద్ ఈరోజు సంచిక నుంచి